బాలీవుడ్ లోకి భాగమతి… అక్కడ కూడా లెక్కతేలాలి

గత కొంతకాలంగా బాలీవుడ్ లో తెలుగు సినిమా హవా పెరుగుతోంది. ఇక్కడ హిట్ అయిన సినిమాలకి అక్కడ రీమేక్ చేస్తూ దర్శక నిర్మాతలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. రీసెంట్ గా అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసి 2019 హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే షాహిద్ కపూర్ హీరోగా నాని జెర్సీ సినిమాని కూడా రీమేక్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఇదే కోవలోకి భాగమతి సినిమా కూడా లైన్ లోకి వచ్చింది.

bhumi bhagamathi

దేవసేన అనుష్క నటించిన భాగమతి సినిమా 2018లో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర 70 కోట్లు రాబట్టిన భాగమతికి కథనమే ప్రధాన బలం. అనుష్క కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాని బాలీవుడ్‌లో తెర‌కెక్కించ‌డానికి డైరెక్ట‌ర్ అశోక్ ప్రయత్నాలు చేస్తున్నారు. భూమి పెడ్నేక‌ర్ ఇందులో టైటిల్ పాత్ర‌లో న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్రస్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ మూవీలో అనుష్కతో పాటు మరో రెండు ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి వాటిలో ప్రముఖ బాలీవుడ్ హీరోలను న‌టింప చేయ‌డానికి అశోక్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.