కళావేదిక – ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి అతిథిగా తెలంగాణ రాష్ట్రా పంచాయతీరాజ్ & మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” 2024 , హైదరాబాద్ లోని హోటల్ “దసపల్లా” లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగును. “కళావేదిక” (R.V.రమణ మూర్తి గారు), ” రాఘవి మీడియా” ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహింపబడును . ఈ సందర్భంగా వేడుకకు విశిష్ట అతిథిగా రావాలన్న మా ఆహ్వానాన్ని మన్నించి అంగీకరించినందుకు తెలంగాణ రాష్ట్రా పంచాయతీరాజ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ (సీతక్క) గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
కావున ఈ నెల 29 న సినీ ప్రముఖులు, NTR అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందింగా విన్నపం.