‘దేవర’ నుండి ఎన్టీఆర్ కొత్త ఫోటో

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మన ముందుకు రాబోతున్న భారీ బడ్జెట్ సినిమా దేవర. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రెండు విభాగాలుగా రాబోతుంది. జాన్హవి కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ తో నటించనుంది. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరి కృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాకు నిర్మాతలుగా ఉన్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బన్నెర్స్ ఈ సినిమాను జంటగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, శృతి మరాఠే, ,శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలలో నటించనున్నారు. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి చాలా బజ్ ఉంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి మొదట వచ్చిన గ్లిమ్ప్స్ కి ప్రేక్షకుల నుండి ఎంతో ప్రేమ లభించింది. అలాగే గ్లిమ్ప్స్ లోని డైలాగ్ ఇంకా బీజీఎమ్ కు రోమాలునిక్కపొడుచునేలా అనిపించింది. ఇటీవలే ఈ సినిమా నుండి వచ్చిన దేవర ఫియర్ సాంగ్ కూడా అభిమానులని చాలా సంతోష పెట్టింది. అనిరుద్ రవిచంద్రన్ అందించిన సంగీతం ఈ పాట అంత బాగా రావడానికి ముఖ్య కారణం.

ఈరోజు దేవర సినిమా కొరియోగ్రాఫర్ అయిన బోస్కో మార్టిన్ ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఒక సెల్ఫీ ఫోటో తన సోషల్ మీడియా మాధ్యమం అయినా ఇంస్టాగ్రామ్ లో పెట్టారు. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కెర్లు కొడుతుంది. అలాగే ఆ ఫోటో కింద “At last we get to VIBE with the exceptionally talented @jrntr” అని పేర్కొన్నారు. అది చుసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

https://www.instagram.com/p/C8g1B0rAe-Z/?utm_source=ig_web_copy_link