‘కల్కి 2898AD’ ట్రైలర్ పై RGV ట్వీట్ – గెలిస్తే లక్ష ఇస్తాను అంటున్న RGV

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కల్కి 2898AD. నాగ అశ్విన్ దర్శకత్వలో వస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా అశ్విని దత్త్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించగా జోర్డ్జ్ స్టోజిల్జ్కోవిక్ సినెమాటోగ్రఫేర్గా చేస్తున్నారు. ఈ చిత్తంలో అమితాబ్ బచ్చన్, దీపికా పాడుకొనే, కమల్ హస్సన్, దిశా పాటని, బ్రహ్మానందం వంటి నటీనటులు ప్రముఖ పాత్రలలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే రోజు రోజుకు ఈ సినిమాలో నటించిన అగ్ర నటులు ఒకొకరిగా బయట పడుతూ ప్రేక్షకులను ఆశ్చర్పరుస్తాన్నారు. ఈ సినిమాలో దుల్కర్ సలీమాన్, విజయ్ దేవరకొండ తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు అనే వార్తలు మెండుగా వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా కల్కి మూవీ టీం విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ లో శోభన, మాళవిక నాయర్ కూడా కనిపించడం జరిగింది. కల్కి 27న విడుదలకు సిద్ధం గా ఉండటంతో ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులే కాకుండా, సినిమా లవర్స్ ఇంకా సామాన్య ప్రేక్షకులకు కూడా ఈ సినిమా పై ఎన్నో ఆశలు కలుగచేసేలా ఉంది ఈ ట్రైలర్.

ట్రైలర్ విషయానికి వస్తే ఈ ట్రైలర్లో ప్రధానంగా అమితాబ్ బచ్చన్ ని, అలాగే ప్రభాస్ ని బాగా చూపించడం జరిగింది. ప్రభాస్ & అమితాబ్ బచ్చన్ ఇరువురికి యుద్ధం జరుగుతున్నట్లు ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది. అలాగే కమల్ హాస్సన్, దీపికా పదుకొనె కూడా ట్రైలర్ లో బాగానే కనిపించరు, ట్రైలర్ చివరిలో ప్రభాస్ డైలాగ్ హై లైట్ గా చెప్పుకోవాలి.

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కల్కి రిలీజ్ ట్రైలర్ విడుదల అయిన తరువాత ఒక ట్వీట్ చేసారు. “M_____F___ing P_____ L___ing A___ B____ing ” అంటూ ట్వీట్ చేసి ఈ పదాలను కరెక్టుగా పూర్తి చేసిన వారికి లక్ష రూపాయిలు బహుమానం ఇస్తాను అంటూ ఆయన ట్వీట్ చేసారు. ఇది చుసిన ఆయన ఫాన్స్ ఇంకా ప్రభాస్ ఫాన్స్ఇంకా కాస్త ఎక్సయిట్మెంట్ ఫీల్ అయ్యారు. ఇక కల్కి సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఈ నెల 27 వరుకు ఎదురు చూడాల్సిందే.