ఈ రోజు బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

బిగ్‌బాస్ నుంచి ప్రతివారం కంటెస్టెంట్స్‌లో ఒకరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. నామినేట్ అయిన కంటెస్టెంట్స్‌లో ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు వచ్చినవారిని హౌస్ నుంచి బయటికి పంపిస్తారు. ఈ వారం బిగ్‌బాస్ సీజన్ 4 నుంచి మెహబూబ్ ఎలిమినేట్ కానున్నాడు.

bigboss 4

ఎలిమినేట్ అయి బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వారిని బిగ్‌బాస్3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చేస్తాడు. హౌస్‌లోని అనుభవాలను ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటారు. స్టార్ మా యాజమాన్యం ఈ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.

ఎలిమినేట్ అయిన మెహబూబ్‌తో రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు అర్థమవుతోంది.