త్రివిక్రమ్ ప్రపోజల్‌కి షాకైన ఎన్టీఆర్..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. సినిమాలోని యాక్షన్ సీన్స్‌ను ఇప్పుడు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది.

NTR

ఎన్టీఆర్ ఆర్ట్స్ , హరిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. లాక్‌డౌన్ వల్ల RRR షూటింగ్ ఆలస్యం కావడంతో.. త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ చేయనున్న సినిమా షూటింగ్ కూడా అనుకున్న సమయానికి స్టార్ట్ చేయలేకపోతున్నారట. దీంతో RRR పూర్తయ్యే లోపు వేరే హీరోతో సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నాడట.

అందులో భాగంగానే మహేష్ బాబుకు త్రివిక్రమ్ కథ చెప్పగా.. దీనికి మహేష్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్ చెప్పాడట. RRR పూర్తయ్యే లోపు మహేష్‌తో సినిమా చేస్తానని చెప్పగా.. దీనికి ఎన్టీఆర్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదట. త్రివిక్రమ్ ప్రపోజల్ చూసి తారక్ షాక్ అయినట్లు టాక్ నడుస్తోంది.