బాలన్స్ షూట్ పనుల్లో టీం ఆచార్య…

సైరా తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. టీజర్ తో మెప్పించిన ఈ మూవీకి సంబంధించి ఇంకా 12 రోజుల షూటింగ్‌ బాలన్స్ ఉంది. వచ్చే నెల రెండో వారం నుంచి ఆచార్య తిరిగి సెట్స్‌పైకి వెళ్లనుంది. కొరటాల ఈ షెడ్యూల్ లో చిరంజీవితో పాటు రామ్‌చరణ్‌పై కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. చివరి షెడ్యూల్‌ కోసం చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌ అయిపోతే ఆచార్య షూటింగ్‌ వర్క్ కంప్లీట్ అయినట్లే.

కరోనా సెకండ్ వేవ్ రాకపోయి ఉంటే ఈ పాటికి ఆచార్య షూటింగ్ ఎప్పుడో అయిపోయి మే13న ప్రేక్షకుల ముందుకి కూడా వచ్చేది. ప్రస్తుతం సెకండ్ వేవ్ ఇంపాక్ట్ తగ్గడంతో ఆచార్య జూలై సెకండ్ వీక్ లో సెట్స్‌పైకి వెళ్లనుంది. వచ్చే ఆఖరికి షూటింగ్ పార్ట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. రిలీజ్‌ డేట్‌ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆచార్యలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, రామ్‌చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.