షారుక్-అట్లీ… మధ్యలో నయన్… ఇది కదా కాంబినేషన్ అంటే

కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్ష షారుక్ ఖాన్ 2018లో జీరో మూవీ అట్టర్ ఫ్లాప్‌ అవడంతో అప్పటి నుంచి కొత్త సినిమాలేవి చేయలేదు. దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న షారుక్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ షెడ్యూల్ ని ఫుల్ టైట్ చేశాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఇప్పటికే పటాన్ మూవీ చేస్తున షారుఖ్ గ్రాండ్ కంబాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. స్పై థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీలో సల్మాన్ ‘టైగర్’లాగా ఎక్స్టెండేడ్ క్యామియో ప్లే చేస్తున్నాడు. పటాన్ సినిమాపై ఇండియన్ ఫిల్మ్ ఫాన్స్ అందరూ భారి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవగానే షారుఖ్ అట్లీ మూవీని సెట్స్ పైకి తీసుకోని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. గత కొంత కాలంగా కోలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న అట్లీ, బాలీవుడ్‌ ఎంట్రీకి రెడీ అవుతూ షారుఖ్ తో సినిమా చేస్తున్నాడు అనే వార్త బయటకి వచ్చింది కానీ ఏది వర్క్ ఔట్ అవ్వలేదు.

తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం షారుఖ్, అట్లీ కలిసి పూర్తి యాక్షన్‌ డ్రామా కథతో సినిమా చేయడానికి సిద్దమయ్యారు. ఈ మోస్ట్ యాంటిసిపెటేడ్ మూవీని షారుక్‌, కరణ్‌ జోహర్‌ కలిసి నిర్మించానున్నారట. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సౌత్ మార్కెట్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారని రంగంలోకి దించారు. అట్లీ ఇటివలే తెరకెక్కించిన బిగిల్ సినిమాలో నయన్ హీరోయిన్ గా నటించింది. హీరోలకి ఏ మాత్రం తగ్గని మార్కెట్ ని సొంతం చేసుకున్న నయనతార సినిమాలో ఉంటే ఎంటైర్ సౌత్ మార్కెట్ కి ఈజీగా అట్రాక్ట్ చేయ్యోచు అనేది అట్లీ అండ్ షారుఖ్ ప్లాన్ అయి ఉండొచ్చు. నయన్ రాక, కరణ్ జోహార్ కలయిక అట్లీ షారుఖ్ సినిమా స్థాయిని అమాంతం పెంచాయి. ఈ ఏడాది చివరికి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.