ఒక సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోలు…

మోస్ట్ టాలెంటెడ్ అండ్ అడ్మైర్డ్ హీరోల్లో విలక్షణ నటుడు ఉపేంద్ర ఒకడు. కొత్త కంటెంట్, క్రియేటివ్ థాట్స్ తో సినిమాలు చేసే ఉపేంద్ర పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ ఏడు భాషల్లో చేస్తున్న సినిమా కబ్జా. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఉపేంద్ర సినిమా అంటే కన్నడతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ని పెంచుతూ కబ్జా మూవీని దర్శకుడు ఆర్.చంద్రు భారి స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.

అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా రేంజ్ ని మరింత పెంచుతూ ఉపేందకి కిచ్చా సుదీప్ కూడా కలిశాడు. గతంలో రెండు సార్లు కలిసి నటించిన ఈ స్టార్స్ సూపర్ హిట్స్ ఇచ్చారు. చివరిగా 2016లో ఈ ఇద్దరూ ముకుందా మురారి సినిమాలో కలిసి నటించారు. పవన్ కళ్యాణ్ వెంకటేష్ కలిసి నటించిన గోపాలా గోపాల సినిమాకి ఇది రీమేక్. దాదాపు అయిదేళ్ళ తర్వాత ఉపేంద్ర సుదీప్ కబ్జా సినిమా కోసం కలిసి మళ్లీ కలిశారు. ఈ మూవీలో కిచ్చా సుదీప్ వర్సెస్ రియల్ స్టార్ ఉపేంద్ర ఎపిసోడ్స్ ఆసక్తికరంగా ఉంటాయని తెలిసింది. తాజాగా రియల్ స్టార్ వర్సెస్ బాద్ షా అంటూ కబ్జా చిత్ర యూనిట్ నుంచి బయటకి వచ్చిన పోస్టర్ అభిమానులని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈ పోస్టర్ కబ్జా సినిమాపై అంచనాలని పెంచింది.