పోస్టర్స్ మాములుగా లేవుగా…

హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, కుర్రాడు సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో వరుణ్‌ సందేశ్‌. సరైన కథలని ఎంచుకోవడంలో విఫలం అయిన వరుణ్ సందేశ్, వరుస ఫ్లాప్స్ ఫేస్ చేస్తూ కెరీర్ ని పూర్తిగా రిస్క్ చేసే స్టేజ్ కి వచ్చేశాడు. ఇక వరుణ్ సందేశ్ ని మర్చిపోవడమే లేట్ అనుకుంటున్న టైములో అతనికి రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఛాన్స్ వచ్చింది. తన బిహేవియర్ అండ్ కూల్ నేచర్ వరుణ్ ని మళ్లీ ప్రేక్షకులకి దెగ్గర చేసింది. టాప్ 3లో ఒకడిగా నిలిచిన వరుణ్ సందేశ్ సినిమాల్లోకి కంబాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. తన రీఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసిన వరుణ్, ఫర్నాజ్‌ శెట్టితో కలిసి ఇందువదన అనే సినిమా చేస్తున్నాడు. ఎమ్‌ఎస్‌ఆర్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మాధవి ఆదుర్తి నిర్మించారు.

గతంలో రిలీజ్ అయిన ఈ మూవీ మోషన్ పోస్టర్ ఆకట్టుకోగా, తాజాగా ఈ మూవీ నుంచి మెయిన్ లీడ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ రెండు పోస్టర్స్ బయటకి వచ్చాయి. ఫర్నజ్ శెట్టి ఇందుగా ఉన్న పోస్టర్ ఒకటి, వరుణ్ వాసుగా ఉన్న పోస్టర్ ఇంకొకటి. ఈ రెండు పోస్టర్స్ సినీ అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. ఇందువదన సినిమాతో వరుణ్ సందేశ్ కంబాక్ ఇవ్వడం గ్యరెంటి అని అందరూ అనుకుంటూ ఉన్నారు. వరుణ్‌ సందేశ్‌ అటవీశాఖ అధికారి పాత్ర పోషించిన ఈ మూవీ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరిపిన క్లైమాక్స్‌ షూటింగ్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తైంది.. సతీష్‌ ఆకేటి కథ, మాటలు అందించిన ఈ చిత్రానికి సంగీతం: శివకాకని, సహనిర్మాత: గిరిధర్‌.