Megastar: దూకుడు మీదున్న మెగాస్టార్ చిరంజీవి..

Megastar: మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మే 13న ఈ చిత్రం రానున్న నేప‌థ్యంలో ఈ చిత్ర నిర్మాణం త్వ‌ర‌గా పూర్తి చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌యి ఉన్నారు. ఈ చిత్రం అనంత‌రం మెగాస్టార్ గ్యాప్ తీసుకోకుండానే త‌దుప‌రి చిత్రాన్ని ప్రారంభించాలని భావిస్తున్నాడ‌ట‌. త‌మిళ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న లూసిఫ‌ర్ చిత్ర రీమేక్ చిత్రంలో చిరంజీవి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

Megastar Chiranjeevi

ప్ర‌స్తుతం దీనికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే నెల రెండో వారం నుంచే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించాల‌ని.. ఈ చిత్ర షూటింగ్‌లో చిరంజీవి పాల్గొనున్నార‌ని స‌మాచారం. మెగాస్టార్ చిరంజీవి ఈ వ‌య‌స్సులో కూడా వ‌రుస సినిమాల‌తో దూకుడుగానే క‌నిపిస్తున్నాడు.. డైరెక్ట‌ర్స్ బాబీ, మెహ‌ర్ ర‌మేశ్ వంటి టాలీవుడ్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవిMegastar.‌