Nagababu: రోజా ఒక‌ క‌మెడియ‌న్.. నాగబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Nagababu: ప్ర‌ముఖ ఛానెల్‌ ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే షో జ‌బ‌ర్ద‌స్త్‌లో కొన్నాళ్ల పాటు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, న‌టి రోజా కలిసి జ‌డ్జిగా వ్య‌వహ‌రించిన విష‌యం తెలిసిందే. ఏ కార‌ణాల‌తో ఆ షో నుంచి నాగ‌బాబు దూర‌మ‌య్యాడు. కాగా తాజాగా త‌న అభిమానుల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు నాగ‌బాబు. ఈ క్ర‌మంలో ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా రోజా పేరు చెప్పి షాకిచ్చాడు.

Nagababu Comments

Nagababu జ‌బ‌ర్ద‌స్త్‌లో మీ ఫెవ‌రెట్ క‌మెడియ‌న్ ఎవ‌ర‌ని అభిమాని అడిగితే.. వెంట‌నే ఇంకేమి ఆలోచించ‌కుండా.. ఇంకెవ‌రు జ‌డ్జి స్థానంలో కూర్చొన్న రోజానే. అని తెలిపాడు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా రోజా ఫ్యాన్స్ స్పందిస్తూ.. జ‌బ‌ర్ద‌స్త్ షోలో జ‌డ్జిగా మీరిద్ద‌రు ఉన్నారు క‌దా.. మీరు కూడా క‌మెడియ‌న్ క‌దా అని కామెంట్స్ చేస్తున్నారు.