Superstar: ర‌జ‌నీకాంత్‌కు విషెస్ తెలిపిన చిరు, వెంకీ, మ‌హేశ్‌!

Superstar: సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్.. సినీ రంగంలో అత్యున్న‌త పుర‌స్కార‌మైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.. ఈ క్ర‌మంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా ర‌జ‌నీకి విషెస్ తెలుపుతూ..

Tollywood

నా ప్రియ‌మైన స్నేహితుడికి ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్ర‌క‌టించ‌డం చాలా సంతోషంగా ఉంది. చిత్ర ప‌రిశ్ర‌మకు మీరు చేసిన సేవ‌లు అనిర్వ‌చ‌నీయం. ఈ అత్యున్న‌త పుర‌స్కారం మీకు ద‌క్కినందుకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే విక్ట‌రీ వెంక‌టేశ్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ట్విట్ట‌ర్ ద్వారా Superstar ర‌జ‌నీకి శుభాకాంక్ష‌లు తెలిపారు.