Acharya: ఆ సాంగ్ ఏంటీ.. మెగాస్టార్ డ్యాన్స్‌ ఏంటీ.. ఆచార్య సాంగ్‌పై సినీ క్రిటిక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Acharya: మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌ల్లో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చిత్రం తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోంది.. ఇక ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్, ఆక‌ట్టుకోగా నిన్న ఫ‌స్ట్ లిరికల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ ప్రేక్ష‌కుల‌ను, మెగాభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.. ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చాడ‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ‌ను పొగడ్త‌ల‌తో ముంచేస్తున్నారు ఫ్యాన్స్‌. అయితే ఈ క్ర‌మంలో తాజాగా ఓ సినీ క్రిటిక్ ఆ సాంగ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు.

Acharya

ఆ సాంగ్ ఏంటీ.. కావాల‌ని భుజాల‌కెత్తుకుని పొగుడుతున్న‌ట్టుందని.. ఆ సాంగ్ అయితే నాకు అంత గొప్ప‌గా ఆహా ఓహో అనే స్థాయిలో లేద‌నిపించంద‌ని అన్నారు. కానీ మ‌ణిశ‌ర్మ కొత్త ప్ర‌యత్నం చేశారు.. అయితే ఈ సినిమాలో ఈ పాట ఏ సంద‌ర్భంలో వ‌స్తుందో తెలియ‌దు కాబ‌ట్టి ఏమి అన‌లేని ప‌రిస్థితి.. చిరంజీవి గారికి ఈ సాంగ్ ఏ మాత్రం సెట్ అవలేదు. ఎవ్వ‌రు కూడా నెగిటివ్ కామెంట్ చేసే ద‌మ్ముగాని, ధైర్యం లేన‌ట్లు అనిపిస్తుంది.. ఒక‌వేళ ఈ సాంగ్ జ‌నాల‌కి ఎక్కి పాపుల‌ర్ అయితే.. మ‌ళ్లీ ఈ సాంగ్ గురించి కామెంట్ చేస్తానని ఆ క్రిటిక్ సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశాడు.. కానీ ఇందులో సెట్టింగ్‌.. మేకింగ్ మాత్రం కేక అనిపించేలా వుంది అని తెలిపాడు.