మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఆచార్య టీజ‌ర్ వ‌చ్చేస్తోంది..‌

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఆచార్య చిత్రం తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ కూడా ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నాడు. దీంతో మెగాభిమానుల్లో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. అలాగే మెగాస్టార్ మోస్ట్ ఫుల్ అండ్ ఫేవ‌రేట్ మ్యూజిక‌ల్ కాంబో మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం హైద‌రాబాద్ శివార్ల‌లో 25కోట్ల‌తో భారీ సెట్ ఆల‌యాన్ని నిర్మించ‌గా.. ఎక్కువ భాగం షూటింగ్‌ అక్క‌డ‌నే ఉంటుంద‌ని చిత్ర‌బృందం నుంచి వినికిడి.

acharya teaser updates

ఈ సినిమాను నిరంజ‌న్ రెడ్డి, రామ్ చ‌ర‌ణ్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. తాజాగా ఆచార్య టీజ‌ర్‌ను రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న రిలీజ్ చేయ‌నున్నార‌ని చిత్ర‌బృందం నుంచి స‌మాచారం. దీంతో మెగాస్టార్ అభిమానులు ఈ టీజ‌ర్‌పైనే భారీ స్థాయిలో అంచ‌నాలు పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్ ప్ర‌ధాన విల‌న్ ‌పాత్ర‌ను పోషిస్తున్నాడు.