విజయ్‌కి జోడీగా పూజాహెగ్దే?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా విజయం సాధించడంతో.. తర్వాతి సినిమాపై విజయ్ ఫోకస్ పెట్టాడు. విజయ్ తన తర్వాతి 65వ సినిమాను నిల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో చేయనున్నాడు. సన్ పిశ్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

PUJAHEGDE IN VIJAY MOVIE

ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజాహెగ్దేను తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు పూజాహెగ్దేను సంప్రదించినట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్ వచ్చిన డైరెక్టర్ దిలీప్ కుమార్.. పూజాహెగ్దేని కలిసి పాత్రకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. విజయ్ పక్కన నటించేందుకు పూజాహెగ్దే కూడా ఓకే చెప్పిందట. వచ్చే నెలలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అలాగే వచ్చే నెలలో ఈ సినిమా పట్టాలకెక్కనుంది.