ఆ హీరోయిన్ నాలుక కోసేయాలన్న పొలిటీషియన్

బాలీవుడ్ హీరోయిన్ రీచా చద్దా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. తాజాగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ వివాదాస్పదంగా మారుతోంది. దళితులను అవమానించేలా ఈ పోస్టర్ ఉందని, అంటరానివారు అనే పదాన్ని ఉపయోగించారని దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రీచా ఇందులో చీపురు పట్టుకున్నట్లు చూపించడం అభ్యంతకరంగా ఉందని, దీనికి తీసివేయాలని ఆందోళన చేపడుతున్నారు.

richa chadda medam chiefminister

ఈ క్రమంలో రీచా చద్దాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆమె నాలుకను కోసేయాలంటూ ఒక రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై రీచా స్పందించింది. మేం ఎవరికీ భయపడం అంటూ ట్వీట్ చేసింది. కాగా రీచా చద్దాకు పలువురు మద్దతు తెలుపుతున్నారు.