జయలలిత బయోపిక్ రిలీజ్ డేట్ ఖరారు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి పేరుతో ఒక బయోపిక్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించగా.. పాన్ ఇండియా మూవీగా దీనిని విడుదల చేయనున్నారు. లాక్‌డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించగా.. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి అయింది. హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ఇటీవల నిర్వహించారు.

jayalalitha biopic release

షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రస్తుం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ కన్ఫామ్ చేశారు. ఫిబ్రవరి 24న ఈ సినిమాను విడుదల చేయాలని సినిమా యూనిట్ భావించింది. గత ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. అరవింద్ స్వామి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించాడు.