ధర్మస్థలిలో సిద్ధుడి అడుగు పడింది

మెగా అభిమానులని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఊహించని వీక్ ఎండ్ గిఫ్ట్ ఇచ్చింది. అసలు ఎలాంటి చడీ చప్పుడు లేకుండా, ముందస్తు హెచ్చరికలు లేకుండా సోషల్ మీడియాలో వచ్చిన ఈ అప్డేట్ సునామిని సృష్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఆచార్య షూటింగ్ ని చిత్ర యూనిట్ మళ్లీ మొదలుపెట్టింది. ఫైనల్ లెగ్ ఆఫ్ షూటింగ్ జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ లో మెగాస్టార్ తో పాటు మెగాపవర్ స్టార్ కూడా నటిస్తున్నాడు. సిద్ధా అనే పాత్రలో ఎక్స్టెండేడ్ క్యామియో ప్లే చేస్తున్న చరణ్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ధర్మస్థలి ద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి, ఫైనల్ షెడ్యూల్ షూట్ లో ఉన్నాం. ఎక్సైటెడ్ అప్డేట్స్ రాబోతున్నాయి అంటూ ట్వీట్ చేశారు. అసలు చిన్న హింట్ కూడా లేకుండా సడన్ గా చేసిన ఈ పోస్టర్ లో చరణ్ బ్లాక్ ప్యాంట్, మెరూన్ లాల్చి, మెడలో రుద్రాక్షమాల, మెడ చుట్టూ శాలువా, మెలితిప్పిన మీసం, నుదుటిన బొట్టుతో కనిపించాడు. చరణ్ ని ఇలాంటి లుక్ లో ఇప్పటివరకూ చూడలేదు. సింపుల్ యట్ పవర్ ఫుల్ గా ఉన్న ఈ పోస్టర్ లో రామ్ చరణ్ కాస్త అటు ఇటుగా ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామరాజు లుక్ లానే కనిపిస్తున్నాడు. హెయిర్ స్టైల్ మాత్రమే కాస్త మారింది. ఈ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ అయిపోగానే పోస్ట్ వర్క్స్ మొదలుపెట్టి… ఆచార్య సినిమాని కొరటాల శివ ఆగుస్ట్ లో ప్రేక్షకుల ముందుకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మణిశర్మ మ్యూజిక్ ఇస్తున్న ఈ మూవీలో చిరు పక్కన కాజల్ నటిస్తూ ఉండగా… చరణ్ పక్కన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. మెగాస్టార్ మెగా పవర్ స్టార్ ల కలయిక తెరపై చూడాలని మెగా అభిమానులు బ్రూస్ లీ నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఆచార్య సినిమాతో అది తీరిపోతుంది.