క్లైమాక్స్ షూటింగ్‌లో వరుణ్ తేజ్ గని..

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ ప్రస్తుతం ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యేది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా గని షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో మేకర్స్ గని షూటింగ్‌ను రిస్టార్ట్ చేసింది. ఈ ఫైనల్ షెడ్యూల్‌తో సినిమా పూర్తి అవుతుందట. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ కి సంబంధించిన క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ టాలీవుడ్ డెబ్యు ఇవ్వనుంది. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో నదియా కనిపించనుంది. గని సినిమాని అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.