విక్ట‌రీ వెంక‌టేశ్‌కు ఛాలెంజ్ విసిరిన మీనా..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్ర‌ముఖ సినీ న‌టి మీనా చెన్నై సైదాపేట్‌లోని త‌న నివాసంలో మొక్క‌లు నాటారు. టీఆర్ఎస్‌ ఎంపీ జోగినిప‌ల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాంక‌ర్‌, బిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్ దేవి నాగ‌వ‌ల్లి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీక‌రించి నేడు చెన్నైలో త‌న నివాసంలో మొక్క‌లు నాటారు మీనా. ఈ సంద‌ర్భంగా మీనా మాట్లాడుతూ.. మారుతున్న వాతావ‌ర‌ణ కాలుష్యాన్ని త‌గ్గించ‌డానికి ప్ర‌తిఒక్క‌రు బాధ్య‌తగా మొక్క‌లు నాటాల‌ని..

meena

అలాగే మొక్క‌ల‌ను నాటి వాటిని సంర‌క్షించే బాధ్య‌త‌ను కూడా తీసుకువాలని అన్నారు. ఇంత మంచి కార్య‌క్ర‌మాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్‌కుమార్ గారికి అభినంద‌న‌లు తెలిపారు. ఈ ఛాలెంజ్ మ‌రింత ముందుకు వెళ్లాల‌ని.. నార‌ప్ప‌గా వ‌స్తున్న హీరో విక్ట‌రీ వెంక‌టేశ్‌తో పాటు క‌న్న‌డ హీరో కిచ్చా సుదీప్‌, మ‌ల‌యాళం హీరోయిన్ మంజు వారియ‌ర్, హీరోయిన్ కీర్తి సురేశ్‌ల‌ను మొక్క‌లు నాటాల్సిందిగా ఆమె ఛాలెంజ్ విసిరారు.