సూరిబాబు లైటింగే మాస్ అంటే, ఆడు డ్యాన్సింగ్ చేస్తే అదోరకం మాస్

సిక్స్ ప్యాక్ హీరో సుధీర్ బాబు, పలాస ఫేమ్ కరుణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. మాస్ అనే పదాన్ని టైటిల్ నుంచే ప్రెజెంట్ చేస్తూ వస్తున్న చిత్ర యూనిట్, శ్రీదేవి సోడా సెంటర్ నుంచి మందులోడా సాంగ్ ని రిలీజ్ చేశారు. మణిశర్మ మ్యూజిక్ లో వచ్చిన ఈ ఊరమాస్ బీట్ సాంగ్ మూవీకి హైలైట్ అవ్వడం ఖాయం అనే రేంజ్ లో ఉంది. సాహితి, ధనంజయ వాయిస్ సాంగ్ కి ఎసెట్ అవ్వగా… యష్ ఖోరియోగ్రాఫి దుమ్ము లేపాడు. సుదీర్ బాబుని ఇంత మాస్ బీట్ సాంగ్ లో ఇప్పటివరకూ చూడని వాళ్లకి ఇదో స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. సుధీర్ డాన్స్ ఏంటో మొదటి సినిమాలోనే చూపించినా కూడా ఈ రేంజ్ మాస్ స్టెప్స్ వేయడం ఇదే మొదటిసారి. మాస్ కా బాస్ అంటూ బయటకి వచ్చిన సాంగ్ ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. అన్నట్లు మందులోడా అనే టైటిల్ చూసి ఇది ఫోక్ సాంగ్ మందులోడా ఓరి మాయలోడా అనే పాటనే అనుకోని పొరబడకండి. మందులోడా అనే పేరే తప్ప ఆ పాటకి, ఈ పాటకి అసలు సంబంధమే లేదు. లిరిక్స్ నుంచి ట్యూన్ వరకూ మణిశర్మ అన్నీ మార్చాడు.