సల్మాన్ ఖాన్ ముందే కత్రినాకి ప్రొపోజ్ చేసిన యంగ్ హీరో… అందరూ షాక్…

బాలీవుడ్ స్టార్ హీరో భాయిజాన్ సల్మాన్ ఖాన్… స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఒకప్పుడు రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కాంబినేషన్ తెరపై కనిపించినా కూడా బాక్సాఫీస్ షేక్ అవుతది. టైగర్ సిరీస్ అందుకే ఉదాహరణ. అంతలా వైరల్ అయిన ఈ జంట విడిపోయి చాలా కాలమే అయ్యింది. పర్సనల్ గా విడిపోయారు కానీ సినిమాలు మాత్రం కలిసే చేస్తున్నారు. ఎంత విడిపోయినా కత్రినా అనగానే చాలా మందికి సల్మాన్ ఖాన్ గుర్తొస్తాడు. అలాంటిది సల్మాన్ ముందే ఒక యంగ్ హీరో కత్రినా కైఫ్ ని పెళ్లి చేసుకుంటావా అని అడిగేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈవెంట్‌లో భాగంగా ఉరి ఫేమ్ హీరో విక్కీ కౌశల్.. కత్రినాకు, సల్మాన్ ఖాన్ ఎదుటే ప్రపోజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్ లో హల్‌చల్ చేస్తోంది.

‘విక్కీ కౌశల్ లాంటి నైస్ గయ్‌ను చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా? ఆల్రెడీ పెళ్లిల్ల సీజన్ నడుస్తోంది కాబట్టి అలా జరిగితే బాగుండు’ అని కత్రినాను అడిగాడు విక్కీ. ఆ తర్వాత వాట్? అంటూ కత్రినా రిప్లయ్ ఇవ్వగా.. ‘ముజ్‌సే షాదీ కరోగీ’ అంటూ సల్మాన్ మూవీలోని పాటనే వాడుతూ అందరి ముందే అడిగేశాడు. ఈ సమయంలో కెమెరాలన్నీ సల్మాన్ రియాక్షన్స్ క్యాప్చర్ చేయడం విశేషం. వీడియో మొదట్లో నవ్వుతూ కనిపించిన భాయ్‌జాన్.. చివరకు తన సిస్టర్ అర్పిత ఖాన్ భుజంపై వాలిపోయాడు. పెళ్లి విషయం అడిగేసిన విక్కీ కొద్దిసేపు కత్రినా రిప్లయ్ కోసం ఎదురుచూడగా.. ఆమె (హిమ్మత్) అంత ధైర్యం లేదని నవ్వుతూ చెప్పడంతో సల్మాన్ ఆశ్చర్యపోతూ అర్పిత భుజం నుంచి లేచాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో 2019లో అంబానీ ఇచ్చిన దివాలి పార్టీలో జరిగింది. ఇదిలా ఉంటే.. ఏడాది కాలంగా విక్కీ, కత్రినా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఇప్పటివరకూ ఈ ఇద్దరూ అఫిషియల్‌గా ప్రకటించ లేదు కానీ లేటెస్ట్‌గా నటుడు హర్షవర్ధన్ రాణే వీరిద్దరి డేటింగ్‌ను కన్‌ఫర్మ్ చేసేశాడు. సల్మాన్ కత్రినా కలిసి త్వరలో టైగర్ సిరీస్ లోని థర్డ్ పార్ట్ లో నటించనున్నారు.