ఫిల్మ్ ఛాంబర్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం సీనియర్ విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ పోటీ చేయనున్నాడు. ప్రకాష్ రాజ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు కూడా. ప్రకాష్ రాజ్ కి పోటిగా ఎవరు నిలబడతారు అని అందరూ ఆలోచిస్తున్న సమయంలో మంచు హీరో విష్ణు ‘మా’ అధ్యక్ష పదవి కోసం పోటీ చేయబోతున్నాడు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో దిగుతూ ఉండగా, విష్ణు మాత్రం మోహన్ బాబు అండతోనే పోటీ చేయడానికి సిద్దమవుతున్నాడు. గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలని ఒకసారి పరిశీలిస్తే గతంలో మోహన్ బాబు ‘మా’కి ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత నాగబాబు మా ఎన్నికల్లో పోటీ చేసి ప్యానెల్ మొత్తాన్ని గెలిపించుకున్నాడు కానీ ఆ సమయంలో మల్లికార్జున రావుని ఇండిపెండెంట్ సెక్రెటరీగా నిలబెట్టి మోహన్ బాబు ఒక్కడే సొంత బలంతో గెలిపించుకున్నాడు. ఒక వ్యక్తి ప్యానెల్ కి వ్యతిరేఖంగా ఇండిపెండెంట్ ని గెలిపించుకోవడంతో అంటే చిన్న విషయం కాదు.
2017లో మెగా ఫ్యామిలీ అంతా కలిసి జయసుధకి సపోర్ట్ చేశారు. ఈ సమయంలో మెగా ఫ్యామిలీతో పాటు మురళి మోహన్ లాంటి సీనియర్స్ కూడా జయసుధకే సపోర్ట్ చేశారు. కానీ సపోర్ట్ ఇచ్చిన వాళ్లకి షాక్ ఇస్తూ ‘మా’ అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ఒక కన్నడ అతను అయిన ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో నిలబడడం, గతంలో తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా గెలిచిన ప్రకాష్ రాజ్ అక్కడి నిధుల లెక్కలు చెప్పలేదు అనే చెడ్డపేరుని మూటగట్టుకున్నారు. ఇలాంటి సమయంలో మంచు విష్ణు లాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మా ఎన్నికల్లో నిలబడడం, అతనికి కృష్ణ కృష్ణంరాజు లాంటి ఒకప్పటి స్టార్ హీరోస్ సపోర్ట్ ఉండడం మా ఎన్నికలని రసవత్తరం చేశాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ బీజీపీని టార్గెట్ చేసి విమర్శలు చేయడం కూడా కృష్ణంరాజు లాంటి వాళ్ళు విష్ణుకి సపోర్ట్ చేయడానికి ఒక కారణం అయి ఉండొచ్చు.
2017 పరిస్థితిని తలపిస్తున్న ఈ మా ఎన్నికలు గత కొంత కాలంగా బాగున్న మంచు మోహన్ బాబు చిరంజీవి మధ్య రిలేషన్ ని కూడా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. నాగబాబు ప్యానెల్ కి వ్యతిరేఖంగా ఒక ఇండిపెండెంట్ నే గెలిపించుకున్న మోహన్ బాబు పోటాపోటిగా జరగనున్న ఈ కొడుకుని గెలిపించుకోవడానికి కృషి చేస్తాడు. ఈ ఎన్నికలు ఇండస్ట్రీలో ఎలాంటి ఊహాతీత పరిణామాలకి దారి తీస్తుందో అనే ఆందోళన అందరిలోనూ ఉంది.