పెంచల్ దాస్… పవన్ కళ్యాణ్… ఒక ఫోక్ సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఫోక్ సాంగ్ ఉండే ఇంపార్టెన్స్ ఏ వేరు. తమ్ముడు నుంచి మొదలుపెడితే అజ్ఞాతవాసిలోని కాటమరాయుడడా కదిరి నరసింహుడా వరకూ సంధర్భం కుదిరినప్పుడల్లా ఒక ఫోక్ సాంగ్ ని తానే పాడి అభిమానులకి కిక్ ఇస్తూ ఉంటాడు. చాలా మంది డైరెక్టర్స్ ఈ ట్రెండ్ ఫాలో అవుతూ పవన్ తో పాట పాడిస్తూ ఉంటారు. అయితే వకీల్ సాబ్ తో కంబాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ ఉన్నాడు. అందులో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు ఒకటి కాగా మరొకటి మలయాళ రిమేక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీని తెలుగులో సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. రానా స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. మంచి ఫామ్ లో ఉన్న తమన్, అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో పెంచలదాస్ ఓ ఫోక్ సాంగ్ పాడించాలి అనుకుంటున్నాడట. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమాలో పెంచల్ దాస్ పాడిన పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అరవింద సమేతకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్. ఈ పవన్ సినిమాలో కూడా స్కోప్ ఉండడంతో, సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ నేపథ్యగీతాన్ని పెంచలదాస్ చేత పాడించాడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ కరోనా కారణంగా ఆగింది. జూలై లేదా ఆగస్టు నుంచి మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం వుంది. పెంచల్ దాస్ కి పవన్ గొంతు కూడా కలిస్తే సాంగ్ సూపర్ హిట్ అవడం ఖాయం.