Mahesh: రాముడిగా మ‌హేశ్‌బాబు.. సీత‌గా దీపికా..రావ‌ణుడిగా ఎవ‌రో తెలుసా..

Mahesh: సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ప్ర‌స్తుతం స‌ర్కార్ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నాడు. గీతాగోవిందం ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో, మైత్రీమూవీ మేక‌ర్స్‌, 14రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, జీఎంబీ ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. ఇందులో మ‌హేశ్‌కు జోడీగా కీర్తిసురేశ్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇక ఈ చిత్రం వ‌చ్చే ఏడాది 2022లో సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.

srirama role mahesh

ఇక ఈ చిత్రం అనంత‌రం Mahesh మ‌హేశ్‌బాబు బాలీవుడ్ చిత్రంలో న‌టించ‌నున్నార‌ని వార్తాలు వెలువ‌డుతున్నాయి. ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క‌త్వంలో రామాయ‌ణాన్ని రూపొందించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేశార‌ట‌. అలాగే ఈ సినిమాను 3డీలో తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఈ సినిమాలో రాముడిగా Mahesh మ‌హేశ్‌బాబు, సీత పాత్ర‌లో దీపికా ప‌దుకునే న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో రావ‌ణుడి పాత్ర‌లో ఎవ‌రో తెలుసా.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌రోష‌న్ రావ‌ణుడిగా చేయ‌నున్న‌ర‌ట‌. ప్ర‌స్తుతం ఈ వార్తా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ అవుతుంది. ఇదిలా ఉంటే యంగ్ రెబెల్‌స్టార్ ప్ర‌భాస్ రాముడి పాత్ర ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడ‌ని విష‌యం తెలిసిందే. ఇందులో సైఫ్ అలీఖాన్ రావ‌ణుడిగా చేయ‌నున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ఆదిపురుష్ కాగా.. ఓంరౌత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది.‌