సంక్రాంతిని టార్గెట్ చేస్తూ మహేశ్ అండ్ టీం మాస్టర్ ప్లాన్

సంక్రాంతి రిలీజ్ ని టార్గెట్ చేస్తూ మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రొమోషన్స్ ని డిసెంబర్ నుంచి గ్రాండ్ గా మొదలుపెట్టనున్నారు. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని త్వరలో రిలీజ్ చేసి, ప్రొమోషన్స్ కిక్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. దేవి కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ ముందుగా బయటకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సాంగ్ జోష్ తగ్గేలోపు టీజర్ ని కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేసేలా మహేశ్ అండ్ కో ప్లాన్ చేస్తున్నారట.

mahesh sarileru neekevvaru

ఈ ప్రమోషనల్ కంటెంట్ తో వచ్చిన హైప్ ని కంటిన్యూ చేసేలా సరిలేరు నీకెవ్వరూ ట్రైలర్ ని కొత్త సంవత్సరం కానుకగా, డిసెంబర్ 31 మిడ్ నైట్ 12కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. జనవరి 12న రిలీజ్ ఉంది కాబట్టి దానికి సరిగ్గా రెండు వరాల ముందు ట్రైలర్ ని రిలీజ్ చేస్తే బజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ లోపు టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేస్తే ప్రొమోషన్స్ పర్ఫెక్ట్ స్వింగ్ లో ఉంటాయి. త్వరలోనే సరిలేరు నీకెవ్వరూ నుంచి ఫస్ట్ సాంగ్ బయటకి రానుంది.