స్కిన్ షో చేయదు కాబట్టే అనుపమ కెరీర్ ఇలా అయ్యిందా?

ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే యాక్టింగ్ స్కిల్స్ తో పాటు అప్పుడప్పుడూ అవసరమొచ్చినప్పుడు స్కిన్ షో చేయడం కూడా తెలిసి ఉండాలి. అప్పుడే హీరోయిన్స్ కి వీలైనంత త్వరగా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడున్న చాలా మంది సో కాల్డ్ స్టార్ హీరోయిన్స్ ఈ ఫార్ములా ఫాలో అవుతున్న వాళ్లే. అయితే సడన్ గా, రేర్ గా కొంతమంది వస్తారు వాళ్లు స్కిన్ షో చేయరు, గ్లామర్ పేరుతో పొట్టి బట్టలు వేసుకోరు దే జస్ట్ ఎర్న్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్స్. ఈ కోవకి చెందిన అమ్మాయిల్లో కీర్తి సురేశ్ కొత్తగా చేరింది, మహానటి సినిమాలో సావిత్రిగా నటించి మెప్పించిన కీర్తి, అందరినీ ఆశ్చర్యపరిచింది. కీర్తి సురేష్ కన్నా ముందే ఈ లిస్ట్ లో చాలా మందే ఉన్నా నిత్య మీనన్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నిత్య, ఇప్పటివరకూ స్కిన్ షో అనే పదానికే దూరంగా ఉంటూ వచ్చింది.

ఈ లిస్ట్ లో తాను కూడా చేరుతాను అంటున్న మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. కెరీర్ స్టార్టింగ్ నుంచి సెలెక్టివ్ సినిమాలు మాత్రమే చేస్తున్న అనుపమ, పాత్ర కోసం గ్లామర్ గా కనిపిస్తుంది కానీ స్కిన్ షో చేయదు. తన బాడీ లాంగ్వేజ్ కి పొట్టి బట్టలు సెట్ అవ్వవు, అందుకే స్కిన్ షో చేయనని అనుపమ ఇప్పటికే చాలా సార్లు చెప్పింది. ఈ కారణంగానే అనుపమకి ఎక్కువ సినిమాల్లో ఛాన్స్ రాలేదనే వాళ్లు కూడా ఉన్నారు. అయితే అవకాశాల కోసం నిత్య, కీర్తి, అనుపమ లాంటి వాళ్లు పద్ధతులు మార్చుకుంటారా అంటే ఆలోచించే సమాధానం చెప్పాల్సి వస్తుందేమో.