తలైవా ఏం చేసిన స్టైల్ గానే ఉంటుంది… దర్బార్ డబ్బింగ్ కంప్లీట్

సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ కలయికలో వస్తున్న సినిమా ‘దర్బార్’. రీసెంట్ గా ఈ మూవీ మోషన్ పోస్టర్ బయటకి వచ్చి తలైవా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. అనిరుద్ మ్యూజిక్ తో బయటికి వచ్చిన మోషన్ పోస్టర్ లో రజినీ, పోలీస్ అవతారంలో ఆదిత్య అరుణాచలంగా కనిపించాడు. సంక్రాంతి రానున్న దర్బార్ పై రజనీ అభిమానులు మాత్రమే కాదు కోలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తోంది.

తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కానున్న దర్బార్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. ముందుగా తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన రజినీ, డబ్బింగ్ కంప్లీట్ చేశాడు. రెండు పాత్రలకి సంబంధించిన డబ్బింగ్ రజినీ పూర్తి చేశాడు. ఈ సమయంలో తీసిన ఫొటోస్ బయటకి వచ్చాయి. వీటిని చూసిన తలైవా ఫ్యాన్స్, రజనీ ఏం చేసినా స్టైలేరా అనే కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.