సడక్ 2 ట్రైలర్: 20 ఏళ్ళ తరువాత మహేష్ భట్ రివెంజ్ స్టోరీ

మొన్నటివరకు అనేక రకాల పోస్టర్స్, ఫస్ట్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకున్న సడక్ 2 చిత్ర యూనిట్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను విడుదల చేసింది. సంజయ్ దత్, అలియా భట్, పూజా భట్, ఆదిత్య రాయ్ కపూర్ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమాను మహేష్ భట్ తెరకెక్కించారు. సడక్ (1991) కు సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాను ఆగస్ట్ 28న డిస్నీ + హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయనున్నారు.

దాదాపు రెండు దశాబ్దాల తరువాత చిత్ర నిర్మాత మహేష్ భట్ దర్శకత్వ బాధ్యతలు తీసుకొని అలాగే కుమార్తె అలియా భట్ తో మొదటి వర్క్ చేస్తూ సడక్ సీక్వెల్ తో వస్తున్నారు. 3 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ సంజయ్ చిత్రం సడక్ సీన్స్ ద్వారా ప్రారంభమవుతుంది, అనంతరం అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ మధ్య రొమాంటిక్ లవ్ స్టోరీని నడిపించారు. ఇక సినిమా ఊహించని విధంగా థ్రిల్లింగ్ జానర్ లోకి వెళ్లడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ రివెంజ్ స్టోరీలో విలన్ క్యారెక్టర్ కూడా చాలా బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.