అపజయం లేని దర్శకుడిగా మంచి క్రేజ్ అందుకున్న స్టార్ కమర్షియల్ దర్శకుడు కొరటాల శివ నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్యతో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందేశాత్మక సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయగలదని చెప్పవచ్చు. ఇక వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను ఎలాగైనా విడుదల చేయాలని దర్శకుడు కొరటాల ఒక కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని నవంబర్ లోనే స్టార్ట్ చేయనున్నారు. మార్చ్ లోనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇక ఆ డేట్ కి కుదరకపోతే మే 9న విడుదల చేయాలని మరో ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే సమ్మర్ లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకి తేవాలని దర్శకుడు కొరటాల ఒక స్ట్రాంగ్ ప్లాన్ అయితే రెడీ చేసుకున్నట్లు టాక్. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఆచార్య అనంతరం కొరటాల అల్లు అర్జున్ తో మరో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా 2022లో వచ్చే అవకాశం ఉంది.