మరోసారి ‘ప్రేయసి’తో ఎయిర్ పోర్ట్ లో కనిపించిన యువ హీరో ”ఆది”!!

కేవలం ఒక కథనాయకుడిగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ తో కూడా మెప్పిస్తున్న యువ నటుడు ఆది పినిశెట్టి ఈ మధ్య కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా అతని పెళ్లికి సంబంధించిన అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతను త్వరలోనే సౌత్ ఇండియన్ హీరోయిన్ నిక్కీ గల్రానిని వివాహం చేసుకోబోతున్నాడని తమిళ్ మిడియాలోనే కాకుండా టాలీవుడ్ మీడియాలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

ఇక రీసెంట్ గా ఈ జంట హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళుతున్నారు అంటూ గత కొన్ని నెలలుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక ఆది తన ఇంట్లో జరిగే ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా నిక్కీని ఆహ్వానిస్తున్నాడు. అలాగే ఆ మధ్య ఆది తండ్రి సీనియర్ దర్శకుడైన రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు పార్టీలో కూడా నిక్కీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఎయిర్ పోర్ట్ లో దర్శనమివ్వడం చూస్తుంటే వీరిద్దరూ త్వరలోనే ఏడాడుగులు వేయబోతున్నారని రూమర్స్ వస్తున్నాయు. మరి ఈ రూమర్స్ కి ఆది ఎప్పుడు ఎండ్ కార్డ్ పెడతాడో చూడాలి.