రాధేశ్యామ్: ప్రభాస్ పుట్టినరోజున టీజర్ రాబోతోందా?

2015లో బాహుబలి చిత్రం వచ్చినప్పుడు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా ఆకాశం హద్దులు దాటేసిన విషయం తెలిసిందే. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇక ప్రభాస్ ఆ తరువాత చేసిన సాహో ఆ స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అందుకే రాధే శ్యామ్ సినిమతో అంచనాలకు తగ్గట్లుగా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.

లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న ఈ రాధే శ్యామ్ సినిమా టీజర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జీల్ ఫేమ్ కెకె.రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యూరప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇక టీజర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేనప్పటికీ.. ప్రభాస్ పుట్టినరోజు మాత్రం ఎదో ఒక మంచి ట్రీట్ ఇవ్వాలి కాబట్టి అభిమానుల కోసం టీజర్ ని రిలీజ్ చేయక తప్పదు. మరి యూవీ క్రియేషన్స్ ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి. ఇక రాధే శ్యామ్ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలని ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.