ఆన్లైన్ లోకి శివ కార్తికేయన్ ‘డాక్టర్’

కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ నటించిన డాక్టర్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్యాంగ్ లీడర్ సినిమా ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా బీస్ట్ కెప్టెన్ నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో డాక్టర్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.

మెడికల్ యాక్షన్ డ్రామాగా డాక్టర్ సినిమా ఉంటుందని వారు తెలిపారు. ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో రిలీజ్‌కు సంబంధించిన తేదీని ఖరారు చేయనున్నట్లు సమాచారం. శివ కార్తీకేయన్ నటించిన డాక్టర్ మూవీ మెడికల్ యాక్షన్ డ్రామాపై కోలీవుడ్ మంచి అంచనాలు ఉన్నాయి. ఇటివలే అనౌన్స్ చేసిన దళపతి విజయ్ బీస్ట్ సినిమాని డైరెక్టర్ నెల్సన్, ఈ డాక్టర్ మూవీని డైరెక్ట్ చేశాడు. అనురుద్ ఇచ్చిన మ్యూజిక్ ఈ మూవీకి స్పెషల్ హైలైట్ గా నిలవనుంది. ఇప్పటికే సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.