పూల్ పక్క ఎల్లో బికినీలో ర’కూల్’…

బాలీవుడ్ సినిమాలపై మనసు పడి అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం హిందీలో రకుల్‌ చేస్తున్న ఐదు సినిమాలే (‘డాక్టర్‌ జీ’, ‘మే డే’, ‘థ్యాంక్‌.. గాడ్‌’, ‘ఎటాక్‌’, మరాఠీ ఫిల్మ్‌ ‘బక్కెట్‌ లిస్ట్‌’ ఫేమ్‌ తేజస్‌ దర్శకత్వంలో సినిమా) ఇందుకు నిదర్శనం. తాజాగా ఈ బ్యూటీ మరో హిందీ సినిమాకు పచ్చజెండా ఊపారని టాక్‌. అక్షయ్‌ కుమార్‌ సరసన ఓ సినిమా అంగీకరించారట. అక్షయ్‌ హీరోగా రంజిత్‌ తివారీ దర్శకత్వంలో ‘బెల్‌బాటమ్‌’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

మళ్లీ రంజిత్‌ దర్శకత్వంలో అక్షయ్‌ ఓ సినిమా చేయనున్నారట. ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్‌కు ఛాన్స్‌ ఇచ్చారట. మొత్తం మీద హిందీలో ఆరు సినిమాలు, సౌత్‌లో మూడు నాలుగు సినిమాలతో రకుల్‌ కెరీర్‌ మూడు పువ్వులు.. ఆరుకాయలుగా సాగుతోంది. హిందీ ‘రాక్షసుడు’: అక్షయ్, రకుల్‌ కాంబినేషన్‌లో రంజిత్‌ తెరకెక్కించనున్నది తమిళ ‘రాచ్చసన్‌’ (2018) హిందీ రీమేక్‌ అనే వార్తలు ఉన్నాయి. మరి… ఈ థ్రిల్లర్‌ మూవీలోనే ఇద్దరూ జంటగా కనిపిస్తారా? లేక ఈ ఇద్దరితో రంజిత్‌ వేరే కథ ప్లాన్‌ చేశారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎల్లో బికినీలో రకుల్ దిగిన పూల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందీ ఆడియన్స్ కి మాత్రమే రకుల్ ఈ రేంజ్ గ్లామర్ షో చేస్తూ ఉంటుంది.