కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

రాజావారు రాణిగారు ఫేమ్ కిరణ్ అబ్బవరం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఎస్.ఆర్ కళ్యాణమండపం సినిమాని రిలీజ్ కి రెడీ చేసిన ఈ హీరో తన బర్త్ డే సందర్భంగా లేటెస్ట్ మూవీ సెబాస్టియన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. సెబాస్టియన్ P.C 524 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ లో కిరణ్ అబ్బవరం కొత్తగా కనిపిస్తున్నాడు. పోలిస్ లకి ఐ సైట్ చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఒక కానిస్టేబుల్ కి కంటి చూపు లేకపోతే ఎలా? అతను పడే కష్టాలు ఎలా ఉండబోతోంది? అనే ఇంట్రెస్టింగ్ థీమ్ తో సెబాస్టియన్ మూవీ తెరకెక్కుతోంది. బాలాజీ సయ్యపురెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గ్లిప్స్ ని చిత్ర యూనిట్ గతేడాది డిసెంబర్ 25న రిలీజ్ చేశారు. గిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సెబాస్టియన్ ఫస్ట్ గ్లిప్స్ కి హైలైట్ అయ్యింది. ఎప్పుడో సినిమా పనులు అన్నీ కంప్లీట్ అయ్యాయి, కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు సందర్భంగా సెబాస్టియన్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశాడు.