బాలీవుడ్ లో ఫ్లైట్ ఎగరేయనున్నారు…

‘ఆకాశం నీ హద్దురా’..కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన బయోపిక్. తమిళంలో సూరారై పోట్రుగా తెరకెక్కిన సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో రిలీజ్ చేశారు. గత కొంతకాలంగా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య ఈ సినిమాతో పాన్ ఇండియన్ స్థాయి హిట్ అందుకున్నాడు. లేడీ స్టార్ డైరెక్టర్ సుధ కొంగర ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అపర్ణ బాలమురళి ఇందులో హీరోయిన్‌గా నటించారు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. సూర్య సొంత నిర్మాణ సంస్థలో నిర్మించారు.

థియేటర్స్ ఓపెన్ చేయకపోవడంతో వెయిట్ చేసిన సూర్య ఓటీటీకి వెళ్ళారు. ఈ నేపథ్యంలో కొన్ని కాంట్రవర్సీలు తలెత్తాయి. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. అప్పులు పెరిగిపోతున్నాయని ఇక ఆగడం మంచిది కాదని ధైర్యం చేసి ఓటీటిలో రిలీజ్ చేసి భారీ హిట్ అందుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా హిందీలో రీమేక్ చేస్తారని ఎవరూ భావించలేదు. ఎట్టకేలకి ‘ఆకాశం నీ హద్దురా’ హిందీలోకి రీమేక్ కాబోతోంది. కానీ ఇంకా ఇందులో హీరో ఎవరు నటిస్తారన్నది ఇంకా తేలలేదు.