బాలీవుడ్ కింగ్, కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా… షారుక్ ఖాన్ అనగానే గుర్తొచ్చే మాటలు ఇవి. 1990 నుంచి దశాబ్దమున్నర పాటు ప్రతి ఏడాది హిట్స్ సూపర్ హిట్స్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన షారుక్… హిట్టు కొట్టి కొన్నేళ్లవుతోంది. కమర్షియల్, ప్రయోగం ఇలా ఏ జానర్ లో సినిమా చేసినా షారుక్ కి మాత్రం హిట్ దొరకలేదు. 2018లో వచ్చిన జీరో సినిమా తరువాత మూడేళ్లు అవుతున్నా షారుక్ ఖాన్ నుంచి మరో సినిమా రాలేదు. షారుక్ నెక్స్ట్ మూవీ ఇదే అంటూ ఎన్నో రూమర్స్ బయటకి వచ్చాయి కానీ అవేమి పట్టాలెక్కలేదు. ప్రస్తుతం పఠాన్ అనే స్పై థ్రిల్లర్ చేస్తున్న షారుక్, ఈ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే తన నెక్స్ట్షా సినిమాని కూడా లూప్ లైన్ లో పెడుతున్న కింగ్‌ఖాన్ – సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీతో సినిమాని చేయబోతున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్లో చివరగా 2002లో దేవ్ దాస్ అనే మూవీ వచ్చింది. షారుక్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన ఈ మూవీ తర్వాత భన్సాలీ-షారుక్ కలిసి సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నారు కానీ ఏదీ వర్క్ అవుట్ అవలేదు. ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. ఒక యువకుడు ప్రేమ కోసం నార్వేకు సైకిల్ పై వెళ్లిన రియల్ స్టోరీ ఆధారంగా ఆ సినిమా ఉంటుందని సమాచారం. భన్సాలి ఆ నిజమైన ప్రేమ కథకు తనదైన శైలిలో స్క్రీన్ ప్లే ను జత చేస్తున్నాడట. లవ్ స్టోరీస్ లో బెస్ట్ ఇచ్చే షారుక్, భన్సాలీ చెప్పిన కథలో ఉన్న ఎమోషన్స్ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ కాంబోపై అఫీషియల్ గా క్లారిటీ రానుంది.