ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అవనున్న భారీ సినిమాలు ఇవే…

సెకండ్ వేవ్ కరోనా దెబ్బకి అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయి. థియేటర్స్, షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. సినీ అభిమానులు మళ్లీ ఓటిటిపై పడ్డారు. సిరీస్ లు సినిమాలు అంటూ ఏ ప్లాట్ ఫామ్ ని వదలకుండా చూస్తున్నారు. మరి ఈ వారంలో ఓటీటీలో రిలీజ్ అవనున్న సినిమాలు ఏంటో చూడండి. మొత్తంగా నాలుగు సినిమాలు ఈ వారం ప్రీమియర్ అవుతుండగా అందులో రెండు భారీ సినిమాలు ఉండడం విశేషం.

1. మినారి – అమెజాన్ ప్రైమ్ వీడియో:

మినారి కొరియన్ భాషలో నిర్మించిన ఒక అమెరికన్ డ్రామా చిత్రం. లీ ఇస్సాక్ చుంగ్ దర్శకత్వం వహించిన ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులలో ఇది ఉత్తమ చిత్ర నామినీలలో ఒకటి. ఈ చిత్రంలో నటనకు యున్ యుహ్-జంగ్ ఉత్తమ సహాయ నటి విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. మినారి మే 11 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.

2. రాధే – జీ ప్లెక్స్:

రాధే థియేటర్లలో మరియు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లో ఒకేసారి విడుదలవుతుంది. సల్మాన్ ఖాన్ ప్రభుదేవా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ నుంచి ఓటీటీలో రిలీజ్ అవుతున్న మొదటి భారీ బడ్జట్ మూవీ. పే పర్ వ్యూ సిస్టమ్ అడాప్ట్ చేసుకుంటూ మే 13 నుండి థియేటర్లలో మరియు జీ ఫ్లెక్స్ లో ప్రీమియర్ అవనుంది.

3. సినిమాబండి – నెట్‌ఫ్లిక్స్:

బాలీవుడ్ డైరెక్టర్స్ రాజ్, డికేల మద్దతుతో రిలీజ్ అవునా తెలుగు మూవీ సినిమా బండి. విలేజ్ సినిమా చేయడానికి ప్రయత్నించే కొద్దిమంది గ్రామస్తుల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కింది. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాగా, తరుణ్ భాస్కర్ పాడిన ప్రమోషనల్ సాంగ్ మంచి హైప్ తెచ్చింది. యూత్ టార్గెట్ గా రానున్న ఈ సినిమా బండి మే 14 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది.

4. కర్ణన్ – అమెజాన్ ప్రైమ్ వీడియో:

ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ డ్రామాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన కర్ణన్, అసురన్ సినిమాని మరిపించే స్థాయిలో ఉంది అంటూ క్రిటిక్స్ కాంప్లిమెంట్స్ ఇవ్వడంతో ఇతర భాషల సినీ అభిమానులంతా కర్ణన్ కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోరికని నిజం చేస్తూ మే 14న కర్ణన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతోంది. ఏ సినిమా హవా ఎలా ఉన్నా కర్ణన్ మూవీ మాత్రం ఈ వీక్ ఓటిటీ ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ అయ్యే ఛాన్స్ ఉంది.