‘ఆచార్య’లో కన్నడ స్టార్ హీరో?

చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో రాంచరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఆసక్తికరంగా మారింది. ఇందులో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటించనున్నాడట.

KICCHA SUDEEP IN ACHARYA

సుదీప్ పాత్ర ఇందులో అద్భుతంగా ఉంటుందట. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో సుదీప్ ఒక కీలక క్యారెక్టర్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆచార్యలో కూడా నటించాల్సిందిగా సినిమా యూనిట్ కోరడంతో.. నటించేందుకు సుదీప్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా మే 13న ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానుంది.