Yash: కేజీఎఫ్ హీరో న‌టించిన “గ‌జ‌కేస‌రి” మార్చి 5న‌..

Yash: కేజీఎఫ్ చిత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న న‌టుడు రాకింగ్ స్టార్ య‌శ్‌. ఈ చిత్రంతో ఎన‌లేని గుర్తింపు సంపాదించుకున్నాడు. అంత‌కుముందు క‌న్న‌డ హీరోగా క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే సుప‌రిచితం. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్ తెర‌కెక్కించిన కేజీఎఫ్‌లో న‌టించి ఏకంగా హీరోగానే కాకుండా.. క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను గుర్తించేలా చేశాడు య‌శ్‌. ఇప్పుడు ఆయ‌న కేజీఎఫ్-2 చిత్రంపై బిజీగా ఉన్నాడు.

Yash old Movie

ఈYash చిత్రం జూలై 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంద‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఇక 2014లో య‌శ్ న‌టించిన క‌న్న‌డ హిట్ మూవీ గ‌జ‌కేస‌రి ను తెలుగులో ఇదే పేరుతో డ‌బ్బింగ్ చేస్తున్నారు. శ్రీ వేదాక్ష‌ర మూవీస్‌, క‌ల‌ర్ అండ్ క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రామారావు చింత‌ప‌ల్లి ఎంఎస్‌. రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ Yashచిత్రం మార్చి 5న తెలుగులో విడుద‌ల కాబోతుంది. ఇందులో య‌శ్ ద్విపాత్రాభిన‌యం చేశారు.