Samantha: టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో 11ఏళ్లు పూర్తి చేసుకున్న స‌మంత అక్కినేని..

Samantha: స‌మంత అక్కినేని టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న న‌టిగా గుర్తింపు సంపాదించుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ వాసుదేవ్‌మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది స‌మంత‌. త‌న తొలి సినిమా హీరో నాగ‌చైత‌న్య‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. కాగా న‌టిగా స‌మంత ఫిబ్ర‌వ‌రి 25తో 11ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకుంది. ఈ 11ఏళ్ల కెరీర్‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి సినీ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ప‌వ‌న్‌, మ‌హేశ్‌, తార‌క్‌, చ‌ర‌ణ్, ఇలా స్టార్ల‌తో న‌టించి మ‌రింత గుర్తింపు సంపాదించుకుంది.

samantha 11years

అలాగే ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి తెర‌కెక్కిన ఈగ చిత్రంలో మ‌హిళ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో Samanthaన‌టించి.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. కేవ‌లం త‌న అందంతోనే కాకుండా అభిన‌యంతో ఎంతో ఆక‌ట్టుకుంది స‌మంత‌. తెలుగుతో పాటు త‌మిల్ సినిమాల్లో కూడా న‌టించింది.. అక్క‌డ కూడా ద‌ళ‌ప‌తి విజ‌య్‌, సూర్య వంటి అగ్ర‌హీరోల‌తో న‌టించి త‌మిళ ప్రేక్ష‌కుల‌ను కూడా ఫిదా చేసింది. ఇక ఆమె న‌టించిన చివ‌రి చిత్రం జాను.. ఈ చిత్రం తమిల్‌లో విజ‌య‌వంత‌మైన 96చిత్రానికి ఇది రీమేక్‌గా వ‌చ్చింది.. ఇందులో త్రిష పాత్ర‌ను Samanthaస‌మంత చేయ‌గా.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. స‌మంత గతేడాది క‌రోన స‌మ‌యంలోనే ఫ్యామిలీ మెన్‌2 వెబ్ సిరీస్‌లో విల‌న్ పాత్ర‌ను పోషించింది. మ‌రోవైపు ఆహ ఓటీటీలో సామ్‌జామ్ అంటూ సంద‌డి చేస్తోంది. త్వ‌ర‌లో ఆమె ప్ర‌ముఖ టాలీవుడ్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న శాకుంత‌లం చిత్రంలో Samanthaస‌మంత న‌టించ‌నుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయ‌నున్నారు.