కేజీఎఫ్ 2 అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది. హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరగ్గా.. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా పాల్గొన్నాడు. సంజయ్ దత్ ఇందులో విలన్ పాత్రలో నటించగా… చివరి షెడ్యూల్ షూటింగ్‌లో యాక్షన్ సీన్లను తెరకెక్కించారు. కేజీఎఫ్ 1 సూపర్ హిట్ కావడంతో.. కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

KGF 2 TEASER RELEASE DATE
KGF 2 TEASER RELEASE DATE

తాజాగా ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. జనవరి 8న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రశాంత్ నీల్ ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ సందర్భంగా యశ్ స్టన్నింగ్ లుక్‌ను ప్రశాంత్ విడుదల చేశారు. ఇందులో యశ్ చేతిలో కర్ర పట్టుకుని చీకట్లో కూర్చోని ఉన్నాడు. ‘సామ్రాజ్యం తలుపు తెరవడానికి కౌంట్‌డౌన్‌ ఇప్పుడు ప్రారంభమవుతుంది’ అని ప్రశాంత్ తెలిపారు.

హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. వారాహి చలన చిత్రం ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది, శ్రీనిధి శెట్టి, రవీనా టండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేష్‌, మాళవిక అవినాష్‌ కీలకపాత్రల్లో నటించారు.