భయపడిన హీరో సునీల్..’అసలేం జరిగింది‘ .. !!

’అసలేం జరిగింది‘ టీజర్ చూసి భయమేసిందని నటుడు సునీల్ అన్నారు. హైదరాబాద్లో ఈ సినిమా టీజర్ ను విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా వైవిధ్యమైన కాన్సెప్టుతో తీసిన ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. శ్రీరాంతో కలిసి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో నటించానని, తను మంచి నటుడని కితాబునిచ్చారు. సినిమా పాటలు మంచి మెలోడియస్ గా ఉన్నాయని, ఎక్సోడస్ మీడియా వైవిధ్యమైన సినిమాలు చేయాలంటూ ఆల్ ద బెస్ట్ చెప్పారు.

ఈ సందర్భంగా నిర్మాత మైనేని నీలిమా చౌదరి మాట్లాడుతూ.. సినిమా మొత్తం థ్రిల్లింగ్ గా ఉంటుందని, ఉయ్యాల శంకర్ కంపోజ్ చేసిన ఫైట్స్, ’చిన్నా‘ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేస్తుందన్నారు. సహ నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగానే సినిమాను విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు శ్రీకర్ రెడ్డి, సంగ కుమార స్వామి, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.