ప్రకాష్ రాజ్ తో మళ్ళీ మొదలైన KGF 2 షూటింగ్

కన్నడ పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ 2 షూటింగ్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానున్న విషయం అందరికీ తెలిసిందే. యష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయడానికి మేకర్స్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కరోనా వైరస్ ఎక్కువవుతున్న తరుణంలో చాలా జాగ్రత్తగా షూటింగ్ ని కొనసాగిస్తున్నారు. ఇక ఈ రోజు బెంగుళూరులో చిత్ర యూనిట్ సభ్యులు తిరిగి సెట్స్ లోకి వచ్చారు.

ఇక సీనియర్ టాలెంటెడ్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా KGF టీమ్ తో కలిశారు. అయితే ఆయన తప్ప మరొక నటుడు కనిపించలేదు. సీనియర్ నటుడు అనంత నాగ్ KGF 2నుంచి తప్పుకోవడంతో ఆయన చేసిన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడితో ఆయన ఎక్కువగా స్క్రిప్ట్ పై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి పరిమిత సిబ్బందితో యాక్షన్ డ్రామా సీన్స్ ని షూట్ చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ బడ్జెట్ తో సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్న సంజయ్ దత్ క్యాన్సర్ భారిన పడటంతో చిత్ర యూనిట్ కొంత ఆందోళనకు గురవుతోంది. ఎక్కువగా యష్, అలాగే సంజయ్ దత్ కి సంబంధించిన ఎపిసోడ్స్ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. మరి సంజయ్ దత్ ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటారో చూడాలి.