డ్రీమ్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్…

ప్రతి నటుడికి కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే మెగా హీరో రామ్ చరణ్ కి కూడా అలాంటి కోరిక బలంగా ఉంది. ఇటీవల ప్రముఖ ఫిల్మ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి వివరణ ఇచ్చాడు. భవిష్యత్తులో ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమా తప్పకుండా చేయాలనుకుంటున్నాను అని వెల్లడించాడు.

రామ్ చరణ్ మాట్లాడుతూ “నేను మంచి స్పోర్ట్స్ డ్రామాలో నటించాలనుకుంటున్నాను. వాస్తవానికి, నేను చాలా కాలం క్రితమే సీనియర్ నిర్మాత ఆర్‌బి చౌదరి గారి ప్రొడక్షన్ లోనే ‘మేరుపు’ అనే స్పోర్ట్స్ డ్రామాకు సంతకం చేశాను. కానీ వివిధ కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది. అప్పటి నుండి నేను రివర్టింగ్ స్పోర్ట్స్ డ్రామా కోసం వెతుకుతున్నాను, కానీ నాకు ఇప్పటివరకు అలాంటి స్క్రిప్ట్స్ రాలేదు, కానీ భవిష్యత్తులో అలాంటి కథలు వస్తే మాత్రం ఏ మాత్రం మిస్ చేసుకోలేను ”అని చరణ్ తెలిపాడు. ఇక చరణ్ ప్రస్తుతం రాజమౌలి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR లో నటిస్తున్న విషయం తెలిసిందే. మరికొన్ని నెలల్లో షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కుదిరితే వచ్చే ఏడాది వేసవి అనంతరం ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.