KGF చాప్టర్ 2: రమిక సేన్ పవర్ఫుల్ క్యారెక్టర్

kgf 2 ramika sen first look

రవీనా టాండన్ పుట్టినరోజున, కెజిఎఫ్: చాప్టర్ 2 యొక్క నిర్మాతలు ఆమె పాత్ర రామిక సేన్ పోస్టర్ ని రిలీజ్ చేశారీ. ‘ది గావెల్ టు బ్రూటాలిటీ’ గా ఆమె పాత్రను హైలెట్ చేస్తున్నట్లు అర్ధమయ్యింది. అధికారం మరియు శక్తితో ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు. ఆమె ఒక క్రూరమైన రాజకీయ నాయకురాలి పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. రాబోయే సీక్వెల్ లో ఎక్కువగా రాకీ (యష్) మరియు అధీరా (సంజయ్), రవీనా టాండన్ మధ్య జరిగే పవర్ఫుల్ సీన్స్ హైలెట్ కానున్నాయట. కథలో వీరే ప్రధానమని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఉపిరితిత్తుల క్యాన్సర్‌తో ఇటీవల తాను గెలిచినట్లు నటుడు సంజయ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ నవంబర్‌లో ప్రారంభమవుతుంది. అప్పుడు సంజయ్ కూడా KGF టీమ్ తో కలవనున్నారు.