శింబు ఈశ్వరన్ లుక్ వైరల్.. మెడలో పాముతో షాక్ ఇచ్చిన హీరో

ఈశ్వరన్ చిత్ర యూనిట్ చివరకు శింబు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. గత కొంతకాలంగా ఈ పోస్టర్ కోసం ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శింబు పోస్టర్లో, ఒక పామును తన చేతుల్లో గట్టిగా పట్టుకున్నట్లుగా పదునైన చూపులతో సూటిగా కనిపిస్తున్నాడు. ఈ 37 ఏళ్ల నటుడు ఫిట్నెస్ లో కూడా మార్పులు చేసినట్లు అర్థమవుతొంది.

ఎస్.టి.ఆర్ అని కూడా పిలువబడే శింబు గత కొంతకాలంగా ఈ సినిమా కోసమే వర్కౌట్స్ చేస్తున్నట్లు చెప్పాడు. వ్యాయామం యొక్క వీడియోలను సోషల్ మీడియాలో తరచూ షేర్ చేస్తూనే ఉన్నాడు బరువు తగ్గడానికి అతను చాలా కష్టపడాల్సి వచ్చిందట. ఈ కోలీవుడ్ స్టార్ స్వయంగా ఈశ్వరన్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినిమాను వచ్చే ఏడాది పొంగల్ కి విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే గత కొన్నేళ్లుగా ప్రేక్షకుల నుంచి కఠినమైన విమర్శలు అందుకుంటున్న శింబు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల త్రిషతో పెళ్లి వ్యవహారం కూడా అతని పేరు వైరల్ అయ్యేలా చేసింది. త్వరలోనే వారు పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.