‘ఓనమ్’ సెలబ్రేషన్స్ తరువాత హైదరాబాద్ లో మెరిసిన ‘కీర్తి సురేశ్’!!

మొత్తానికి సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభమవుతున్న తరుణంలో, విమానాశ్రయంలో చాలా మంది సినీ ప్రముఖులు కనిపిస్తున్నారు. ఇటీవల తాజాగా కీర్తి సురేష్ కూడా కనిపించింది. చెన్నై నుండి ప్రయాణించిన తరువాత బుధవారం రాత్రి హైదరాబాద్ విమానాశ్రయంలో దర్శనమిచ్చిన మహానటి డిఫరెంట్ లుక్ తో కనిపించింది. సౌకర్యవంతమైన అథ్లెటిజర్ బ్లాక్ ప్యాంటు అలాగే వైట్ టీ-షర్టులో కనిపించిన కీర్తి కూల్ గ్లాసెస్ కూడా పెట్టుకుంది. ఇక బ్లాక్ రన్నింగ్ షూస్‌తో సింపుల్ గా కనిపించింది.

ఇటీవల తన పెంపుడు జంతువులతో మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఓనమ్‌ను తన ఇంట్లో జరుపుకున్న ఈ నటి సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక సినిమా విషయాలకు వస్తే.. ఈ నటి త్వరలో రానున్న గుడ్ లక్ సఖిలో ఆధీ పినిశెట్టితో కలిసి నటించింది. స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఆ సినిమా టీజర్ కి ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే మిస్ ఇండియాలో గ్లామరస్ పాత్రలో కనిపించనున్న కీర్తి సురేష్ నెక్స్ట్ నితిన్ రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మహేష్ బాబు సర్కారు వారి పాటలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.