అఫీషియల్:’ప్రభాస్’ సినిమాలో లంకేషుడిగా బాలీవుడ్ స్టార్

ప్రభాస్ 22వ ప్రాజెక్ట్ ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బిగెస్ట్ పాన్ ఇండియా సినిమాగా రానున్న ఆ సినిమా 3D లో రామాయణంగా రూపొందనున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. అంచనాలకు ఏ మాత్రం తక్కువకాకుండా ఆ సినిమాను రూపొందిస్తున్నట్లు ఆ సినిమా అప్డేట్స్ చూస్తుంటేనే అర్ధమవుతోంది.

ఇక ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని కూడా ఇచ్చేశారు. సినిమాలో లంకేషుడిగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నట్లు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ లాంటి హీరో రాముడి పాత్రలో నటిస్తున్నాడు అంటే ఇక రావణుడి పాత్ర అంతకంటే బలంగా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అనుకున్నట్లే సైఫ్ అలీ ఖాన్ లాంటి బడా స్టార్ ని సెట్ చేసుకున్నారు. మరి ఆ పాత్ర ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.